సెప్టెంబర్ 28 నుండి సౌదీ మెలోడీ ఫెస్టివల్

- August 30, 2023 , by Maagulf
సెప్టెంబర్ 28 నుండి సౌదీ మెలోడీ ఫెస్టివల్

జెడ్డా: "కింగ్‌డమ్ మెలోడీ ఫెస్టివల్" ద్వారా సౌదీ అరేబియా సంగీత వారసత్వాన్ని ప్రపంచానికి చాటేందుకు సౌదీఅరేబియా సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సిద్ధంగా ఉంది. సెప్టెంబర్ 28 నుండి 30 వరకు ఈ మ్యూజిక్ ఫెస్టివల్ ను నిర్వహించనున్నారు. సౌదీ విజన్ 2030 కింద క్వాలిటీ ఆఫ్ లైఫ్ ప్రోగ్రామ్ లో భాగంగా ఈ కార్యక్రమాన్ని గ్రాండ్ స్టేజ్ జెడ్డా సూపర్‌డోమ్ లో నిర్వహించనున్నారు. ఒమర్ కదర్స్, ఫౌజీ మహ్సూన్, సలేహ్ అల్-షెహ్రీ, మహమ్మద్ షఫీక్, తారిఖ్ అబ్దుల్ హకీమ్, తలాల్ బఘేర్ మరియు అబ్దెల్ రబ్ ఇద్రిస్ వంటి ప్రముఖులు హాజరుకానున్నారు. రెండవ రోజు ఫౌజీ మహసూన్, సలేహ్ అల్-షెహ్రీ పాటల ప్రోగ్రామ్ హైలెట్ గా నిల్వనుందని నిర్వాహకులు ప్రకటించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com