ప్రపంచంలోనే తొలిసారిగా మెడిసన్ పంపిణీకి ఆటోమేటెడ్ మెషీన్లు

- August 31, 2023 , by Maagulf
ప్రపంచంలోనే తొలిసారిగా  మెడిసన్ పంపిణీకి ఆటోమేటెడ్ మెషీన్లు

టబుక్: సౌదీ అరేబియాలోని వాయువ్య ప్రాంతంలోని కింగ్ సల్మాన్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ హాస్పిటల్ ద్వారా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ (MODHS)లోని హెల్త్ సర్వీసెస్ జనరల్ డైరెక్టరేట్, మెడిసన్ల పంపిణీ చేయడానికి ప్రపంచంలోనే మొట్టమొదటి ఆటోమేటెడ్ మెషీన్‌ను విజయవంతంగా ఏర్పాటు చేసింది. రోగి ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఈ పరికరం మందులను పంపిణీ చేస్తుంది. ఈ ప్రయోగాత్మక మెషిన్ ప్రపంచంలోనే మొట్టమొదటిదని  హెల్త్ డైరెక్టరేట్ వెల్లడించింది. మెషీన్‌లో మందుల ప్రిస్క్రిప్షన్ బార్‌కోడ్‌ను నిర్వహించే వర్క్‌స్టేషన్, లబ్ధిదారుడు ఉపయోగించేందుకు ఇంటరాక్షన్ స్క్రీన్, ప్రత్యేక ఆపరేటింగ్ సిస్టమ్ (రోబోట్)తో పాటు, ప్రిస్క్రిప్షన్ గురించి లబ్దిదారునికి తెలియజేయడానికి మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ ఉంటుంది. యంత్రం 102-700 ప్రిస్క్రిప్షన్‌ల నిల్వ సామర్థ్యంతో లబ్ధిదారులకు సేవలు అందిస్తుంది. ఇది డ్యామేజ్, ట్యాంపరింగ్ లేదా దొంగతనం నుండి మెడిసన్లకు అత్యంత అధిక రక్షణను అందిస్తుంది. ప్రిస్క్రిప్షన్‌కు జోడించిన బార్‌కోడ్‌ను స్కాన్ చేసి, అవసరమైన డేటా ద్వారా ఈ యంత్రం పనిచేస్తుందని, ఆపై లబ్ధిదారులు తమ స్థానానికి సమీపంలోని డిస్పెన్సింగ్ మెషీన్‌ను ఎంచుకోవలసిందిగా కోరతారని ఆసుపత్రి ఫార్మసీ విభాగం డైరెక్టర్ ఒలాయన్ అల్-అటావీ తెలిపారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com