హైదరాబాద్ లో రేవ్ పార్టీని భగ్నం చేసిన పోలీసులు
- August 31, 2023
హైదరాబాద్: మాదాపూర్ లో రేవ్ పార్టీ ని పోలీసులు భగ్నం చేసారు. మాదాపూర్, విఠల్‌రావునగర్, వైష్ణవి అపార్ట్మెంట్లో రేవ్ పార్టీ జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఒక్కసారిగా దాడి చేసి పార్టీ ని భగ్నం చేసారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఢమరుకం, పూల రంగుడు, లౌవ్లీ, ఆటో నగర్ సూర్య తదితర సినిమాలకు ఫైనాన్సియర్‌గా పనిచేసిన వెంకట్ ఆధ్వర్యంలో ఈ రేవ్ పార్టీ జరిగినట్లు తేలింది. గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి గత కొద్దీ నెలలుగా పార్టీలు నిర్వహిస్తున్నాడు. వెంకట్ కదిలికలపై గత మూడు నెలలుగా నార్కోటిక్ బ్యూరో పోలీసులు నిఘా పెట్టారు. నిందితుల వద్ద నుంచి ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వెంకట్ వాట్సాప్ చాట్‌ను పోలీసులు పరిశీలించారు.
ఈ దాడిలో ఓ సినీ నిర్మాతతోపాటు పలువురిని అరెస్టు చేశారు. పట్టుబడిన వారిలో సినీ పరిశ్రమకు చెందిన పలువురు యువతులు ఉన్నట్లు సమాచారం. డ్రగ్స్ సేవిస్తూ దొరికిన ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుపడ్డ యువతి యువకులు వద్ద నుంచి కోకైన్, ఎల్ఎస్డీ డ్రగ్స్, గాంజాయితో పాటు రూ. 70 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వారిలో ఇద్దరు యువతులు ఢిల్లీకి చెందిన వారిగా గుర్తించారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







