కిచ్చ సుదీప్–విజయేంద్ర ప్రసాద్ పాన్ ఇండియా సినిమా..
- September 02, 2023
బెంగుళూరు: కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ విక్రాంత్ రోనా సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ఇటీవలే తన 46వ సినిమాని అనౌన్స్ చేశాడు. ఈ సినిమా ఫుల్ మాస్ గా ఉండబోతుందని ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ తో చెప్పేశారు. తాజాగా తన నెక్స్ట్ సినిమాని అనౌన్స్ చేశారు కిచ్చ సుదీప్. నేడు సుదీప్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాని ప్రకటించారు.
కిచ్చ సుదీప్ హీరోగా కన్నడ ప్రముఖ డైరెక్టర్ R చంద్రు ఈ పాన్ ఇండియా సినిమాని తెరకెక్కిస్తున్నాడు. చంద్రు ఇటీవలే ఉపేంద్రతో కబ్జా సినిమాని తెరకెక్కించగా ఇది ఫ్లాప్ అయింది. ఈ సినిమా ఫ్లాప్ అవ్వడంతో కబ్జా 2 సినిమాని పక్కనపెట్టి ఇప్పుడు సుదీప్ తో సినిమా తీస్తున్నాడు. అయితే ఈ సినిమాకి రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ స్క్రిప్ట్ సూపర్ వైజర్ గా పని చేస్తున్నారు.
చంద్రు కథ రాయగా దానిని విజయేంద్రప్రసాద్ మార్పులు చేర్పులు చేసి ఫైనల్ చేస్తారని సమాచారం. ఈ సినిమాని కూడా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తుండటంతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. సుదీప్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సినిమాని ప్రకటించారు చిత్రయూనిట్. ఈ సినిమా యాక్షన్ ఓరియెంటెడ్ ఉండబోతుందని సమాచారం.
తాజా వార్తలు
- భారత్-ఇజ్రాయెల్ మధ్య కీలక ఒప్పందాలు
- మళ్లీ తగ్గిన బంగారం ధర..పసిడి ప్రియులకు కాస్త ఊరట
- సౌదీ చమురుయేతర ఎగుమతుల్లో 18.6% వృద్ధి..!!
- సల్మాబాద్‌లోని గ్యారేజీని దోచుకున్న ఫేక్ పోలీసులు..!!
- బ్యాడ్మింటన్ గేమ్ ఆడుతూ..కేరళ వాసి మృతి..!!
- దక్షిణ అల్ బటినాలో ఫ్రాడ్ సస్పెక్ట్ అరెస్ట్..!!
- ఖతార్ లో 7 శాతం పెరిగిన FDI లు..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఎయిర్ ఫెయిర్స్ కు రెక్కలు..!!
- ఆన్లైన్ కంటెంట్‌కు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు బాధ్యత వహించాలి: మంత్రి వైష్ణవ్
- గన్నవరంలో ఈ నెల 28న జాబ్ మేళా









