వికలాంగుల సేవల అభివృద్ధికి ల్యాబ్ ఏర్పాటు
- September 06, 2023
మస్కట్: వికలాంగులకు అనుకూలంగా సేవలు,కార్యక్రమాలను అభివృద్ధి చేయడానికి ఒక ప్రయోగశాల ఏర్పాటు కోసం సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ మంగళవారం ఒమన్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ (ఓమిన్‌వెస్ట్)తో ఒప్పందం కుదుర్చుకుంది. మంత్రిత్వ శాఖ ప్రాంగణంలో సోషల్ డెవలప్‌మెంట్ మంత్రి డాక్టర్ లైలా అహ్మద్ అల్ నజ్జర్, ఓమిన్‌వెస్ట్ గ్రూప్ సీఈఓ అబ్దుల్ అజీజ్ మహ్మద్ అల్ బలూషి ఈ ఒప్పందంపై సంతకం చేశారు. ఒమన్ విజన్ 2040ని అమలు చేయడానికి, విజన్ హాత్మక ప్రాధాన్యతలు, లక్ష్యాలకు అనుకూలంగా ఉండే కార్యక్రమాలు, ప్రాజెక్టులను అభివృద్ధి చేసే ప్రయత్నాలు ఈ ఒప్పందంలో భాగంగా ఉన్నాయి. కార్యక్రమంలో డాక్టర్ లైలా అహ్మద్ మాట్లాడుతూ.. సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ, ప్రైవేట్ రంగ సంస్థల మధ్య ఇప్పటికే ఉన్న భాగస్వామ్యాన్ని ఈ కార్యక్రమం ప్రతిబింబిస్తుందని అన్నారు. అటువంటి ప్రయోగశాలల స్థాపన వైకల్య సేవా రంగంలో భాగస్వాములతో ప్రయత్నాల ఏకీకరణను మెరుగుపరుస్తుందని, మునుపటి ప్రయత్నాలను పూర్తి చేస్తుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్









