రామ్, రకుల్ ప్రీత్ సింగ్ తో జోడి...
- May 19, 2016
చాలా రోజులుగా ఓ బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎదురుచూసిన యంగ్ హీరో రామ్, నేను శైలజ సినిమాతో అనుకున్నది సాధించాడు. కీర్తి సురేష్ హీరోయిన్ గా కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన నేను శైలజ, రామ్ కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సక్సెస్ తరువాత ఎలాంటి సినిమా చేయాలన్న ఆలోచనతో చాలా రోజులు గడిపేసిన రామ్ ఫైనల్ గా కందిరీగ కాంబినేషన్ లో సినిమా అంగీకరించాడు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాకు హీరోయిన్ ను వెతికే పనిలో ఉన్నారు చిత్రయూనిట్.ముందుగా సినిమాలో తమన్నాను హీరోయిన్ గా తీసుకోవాలని భావించారు, అయితే గతంలో రామ్, తమన్నాల కాంబినేషన్ లో వచ్చిన ఎందుకంటే ప్రేమంట ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. దీంతో తమన్నా కన్నా రాశీఖన్నా బెటర్ అని ఫీల్ అయ్యారు. అయితే రామ్, రాశీతో జోడి కట్టిన శివం సినిమా రిజల్ట్ కూడా ఆశించిన స్థాయిలో లేకపోవటంతో రామ్ మరోసారి ఆలోచనలో పడ్డాడు. ఫైనల్ గా తనతో సక్సెస్ ఫుల్ పెయిర్ అనిపించుకున్న రకుల్ ప్రీత్ సింగ్ తో జోడి కట్టేందుకు ఫిక్స్ అయ్యాడు రామ్. పండగచేస్కో సినిమాతో పర్వాలేదని పించిన ఈ జంట ఇప్పుడు మరోసారి వెండితెర మీద సందడి చేయడానికి రెడీ అవుతోంది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







