$83.4 బిలియన్లకు చేరిన ఇంట్రా-జిసిసి ఎగుమతులు
- September 07, 2023
సలాలా: జిసిసి ఎకనామిక్ అండ్ డెవలప్‌మెంట్ అఫైర్స్ అథారిటీ మంత్రుల స్థాయి స్టాండింగ్ ప్రిపరేటరీ కమిటీ బుధవారం సలాలాలో 5వ సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి ఆర్థిక మంత్రి డాక్టర్ సైద్ మొహమ్మద్ అల్ సక్రి అధ్యక్షత వహించారు. GCC ఆర్థిక మరియు అభివృద్ధి వ్యవహారాల అథారిటీ యొక్క మంత్రి స్థాయి స్టాండింగ్ ప్రిపరేటరీ కమిటీ ఛైర్మన్‌లు హాజరయ్యారు. సభ్యదేశాల మధ్య సహకారం, సమన్వయం పెంపొందించే ప్రయత్నాలను పెంచాలని సమావేశంలో ఆర్థిక మంత్రి డాక్టర్ సైద్ మహమ్మద్ అల్ సక్రి తన స్వాగత ప్రసంగంలో పేర్కొన్నారు. ఇటీవలి సంవత్సరాలలో GCC ఆర్థిక వ్యవస్థలు మెరుగ్గా ఉన్నాయని తెలిపారు. ఇంట్రా-జిసిసి ఎగుమతులు 13.4 శాతం పెరిగి 2020లో 73.5 బిలియన్ డాలర్లతో పోలిస్తే 2021లో 83.4 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని అల్ సక్రి సూచించారు. గల్ఫ్ స్టాటిస్టిక్స్ సెంటర్ GCC ఉమ్మడి మార్కెట్‌లో అమలు స్థాయికి సంబంధించిన వివరణాత్మక పనితీరు డాష్‌బోర్డ్‌ను గల్ఫ్ ఉమ్మడి నిర్ణయాల అమలును తెలుసుకోవడానికి అవసరమైన చర్యలపై సమీక్షించారు. కమిటీ నిర్ణయాలు, సిఫార్సులు తదుపరి సెషన్‌లో ఆర్థిక, అభివృద్ధి వ్యవహారాల సుప్రీం కమిటీకి సమర్పించనున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్‌బైజాన్‌లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!









