ఒక్కరోజే రెండు శుభవార్తలు ..
- May 19, 2016
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఒక్కరోజే రెండు బంపర్ ఆఫర్లు వచ్చినట్లయింది. ఒక పక్క ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన యాపిల్ సంస్థ.. తమ ఆవిష్కరణ కేంద్రాన్ని ఈ రోజు హైదరాబాద్‌లో ప్రారంభించింది. దీంతో ఇక్కడ గూగుల్, మైక్రోసాఫ్ట్‌లాంటి దిగ్గజ సంస్థల సరసన యాపిల్ కూడా చేరిపోయి భాగ్యనగర ప్రతిష్ఠను మరింత ఇనుమడింపజేసింది.మరో పక్క ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ ఉప ఎన్నికలో తెరాస అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టమైన మెజారిటీతో భారీ విజయాన్ని సాధించారు. కాంగ్రెస్ కంచుకోటను బద్ధలుగొట్టి ఆయన అక్కడ విజయ బావుటా ఎగరవేశారు. మొదటి రౌండ్ నుంచీ అదే జోరుతో ఆధిక్యతను ప్రదర్శించారు. 45 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి సుచరితారెడ్డి ఓటమి చెందారు. ఈ రెండు పరిణామాలతో తెరాస అధినేతలు ఒక్కరోజే రెండు శుభవార్తలు విన్నట్లయ్యింది. దీంతో వారికి ఈ రోజు ఓ మధుర స్మృతిగా మిగిలిపోనుంది
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







