G20లో ప్రపంచ నాయకులకు భారత్ స్వాగతం.. తొలిరోజు ఎజెండా ఇదే
- September 09, 2023
యూఏఈ: 18వ G20 సమ్మిట్‌కు హాజరవుతున్న ప్రపంచ నాయకులతో భారత రాజధాని న్యూఢిల్లీ సందడిగా మారింది. ప్రపంచ నాయకులకు భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతం పలికారు. ఈ సమ్మిట్‌కు 30 మందికి పైగా దేశాధినేతలు, యూరోపియన్ యూనియన్ , ఆహ్వానిత అతిథి దేశాలు , 14 అంతర్జాతీయ సంస్థల అధిపతులు, ఉన్నతాధికారులు హాజరవుతున్నారు. సెప్టెంబర్ 9-10 తేదీలలో G20 లీడర్స్ సమ్మిట్ జరుగనుంది.
G20 సమ్మిట్ యొక్క మొదటి సెషన్లో 'వన్ ఎర్త్' జరుగింది. G20 లీడర్స్ సమ్మిట్‌లో సెషన్‌లో వన్ ఎర్త్ ప్రధాన చర్చ సాగింది. ముఖ్యంగా, భారతదేశం అధ్యక్షతన జరుగుతున్న ఈ సంవత్సరం G20 సమ్మిట్ యొక్క థీమ్ “వసుధైవ కుటుంబం” లేదా “ఒకే భూమి · ఒక కుటుంబం · ఒక భవిష్యత్తు” - మహా ఉపనిషత్ యొక్క ప్రాచీన సంస్కృత గ్రంథం నుండి తీసుకోబడింది. 'వన్ ఎర్త్' సెషన్ ముగిసిన తర్వాత లంచ్ కార్యక్రమం జరిగింది. మధ్యాహ్నం 3.00 గంటలకు 'వన్ ఫ్యామిలీ' మరో సెషన్ నిర్వహించారు. అతిధులకు సాయంత్రం 7:00 గంటలకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విందు ఇవ్వనున్నారు. దేశ రాజధాని నగరంలో జరిగే ఈ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునక్, సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా తదితరులు హాజరయ్యారు. ఈ సదస్సులో చైనాకు చైనా ప్రధాని లీ కియాంగ్ ప్రాతినిధ్యం వహిస్తుండగా, రష్యా తరపున రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- 2026 నూతన నాయకత్వాన్ని ఎంచుకోనున్న WTITC
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ 2025..ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్‌గా కల్కి 2898AD
- వందే భారత్ విస్తరణ–నాలుగు కొత్త రైళ్లకు గ్రీన్ సిగ్నల్!
- కువైట్, ఈజిప్ట్ సంబంధాలు బలోపేతం..!!
- ఐదుగురుని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- మెడికల్ అలెర్ట్: షింగిల్స్ వ్యాక్సిన్ తో స్ట్రోక్, డిమెన్షియా దూరం..!!
- 21వ ప్రాంతీయ భద్రతా సమ్మిట్ 'మనామా డైలాగ్ 2025' ప్రారంభం..!!
- సౌదీలో 60.9 మిలియన్ల పర్యాటకులు..ఖర్చు SR161 బిలియన్లు..!!
- ‘ప్రపంచ ఉత్తమ విమానయాన సంస్థగా ఖతార్ ఎయిర్వేస్..!!
- ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం







