మొరాకో భూకంపం: 2,000 దాటిన మృతుల సంఖ్య..!
- September 10, 2023
యూఏఈ: మొరాకోలో సంభవించిన శక్తివంతమైన భూకంపంలో మరణించిన వారి సంఖ్య 2,000 దాటింది. వేల మందికి పైగా గాయపడ్డారు. అందులో కొందరి పరిస్థితి సీరియస్ గా ఉందని ఆ దేశ మంత్రిత్వ శాఖ ప్రకటన తెలిపింది. ఈ భూకంపంలో కనీసం 2,012 మంది చనిపోయారని, 2,059 మంది గాయపడ్డారని, వీరిలో 1,404 మంది పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. భూకంప కేంద్రమైన అల్-హౌజ్ ప్రావిన్స్‌లో 1,293 మంది మరణించగా.. టరౌడెంట్ ప్రావిన్స్‌లో 452 మంది మరణించారని పేర్కొంది. మొరాకోలోని హై అట్లాస్ పర్వతాలలో శుక్రవారం అర్థరాత్రి 7.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. చాలా మరణాలు భూకంప కేంద్రానికి సమీప నగరమైన మర్రకేచ్ వెలుపల ఉన్న పర్వత ప్రాంతాలలో సంభవించాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







