కువైట్ లో సెప్టెంబర్ 28న ప్రభుత్వ సెలవు

- September 12, 2023 , by Maagulf
కువైట్ లో సెప్టెంబర్ 28న ప్రభుత్వ సెలవు

కువైట్: ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) జయంతిని పురస్కరించుకుని సెప్టెంబర్ 28వ తేదీని గురువారం సెలవు దినంగా ప్రకటిస్తున్నట్లు  కువైట్ మంత్రిమండలి సోమవారం ప్రకటించింది. క్యాబినెట్ తన వారపు సమావేశంలో ఈ మేరకు నిర్ణయించింది. ప్రభుత్వ సంస్థలు, మంత్రిత్వ శాఖలకు ఆరోజున సెలవు ఉంటుందని, ఇతర సంస్థలు తమ స్వంత ప్రత్యేక విధానాలకు అనుగుణంగా పని మరియు కార్యకలాపాలను కొనసాగిస్తాయని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com