చక్కెర వ్యాధి.. లాభాలు.!
- May 19, 2016
ఏంటిది.. మహమ్మారి షుగర్ వ్యాధితో లాభాలేంటనుకుంటున్నారా.. రోగులకు కాదు, షుగర్ వ్యాధికి మందులు తయారు చేసే సంస్థలకు.. ట్రీట్మెంట్ చేసే డాక్టర్లకు. రానురాను ఆయా మందుల తయారీ సంస్థలకు, డయాబెటీస్ ప్రాఫిట్స్ పెరిగిపోతున్నాయి. మెడికల్ ఫ్రాటర్నిటీకి ఇవి కాసులు కురిపిస్తున్నాయి.
2005లో భారత్లో షుగర్ వ్యాధి బాధితుల సంఖ్య 40 మిలియన్లు కాగా, 2015 నాటికి 65.1 మిలియన్లకు, 2030 నాటికి 30 మిలియన్లకు చేరుతుందని లెక్కలు చెబుతున్నాయి. షుగర్ వ్యాధి బాధితుల సగటు నెలసరి ఖర్చులు పెరిగిపోతున్నాయి. డాక్టర్‌ను సంప్రదించేందుకు ఒక్కో పేషెంటూ నెలకు 700 నుంచి వెయ్యి రూపాయలు, రెగ్యులర్ ల్యాబ్ టెస్టులకు 5 నుంచి 7 వందలు, మెడిసిన్స్, ఇన్సులిన్ తదితరాలకు దాదాపు 6వేల వరకూ ఖర్చయిపోతున్నాడని వాల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిర్వహించిన శాంపిల్ సర్వే చెబుతోంది.
అంతేకాదు, రాబోయే 5 ఏళ్ల కాలంలో 50వేలు, పదేళ్ల కాలంలో 80వేలు, 20ఏళ్ల కాలంలో లక్ష చొప్పున షుగర్ బాధితులు ప్రతి ఏడాదీ తమ ట్రీట్మెంట్‌కు సమర్పించుకోవాల్సిన పరిస్థితి దాపురించే అవకాశం కనిపిస్తోంది. చిన్నవయుసులోనే షుగర్ బారిన పడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వ్యాధి నియంత్రణ, నివారణకు సరికొత్త చౌకైన మందులు రావాల్సిన అవసరం ఎంతో కనిపిస్తోంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన







