ఉదయాన్నే అల్లం రసం తాగుతున్నారా.?
- September 12, 2023
చాలా మందికి ఉదయాన్నే (పరగడుపున) అల్లం తినే అలవాటుంటుంది. కొందరు అల్లం ముక్కలుగా చేసుకుని అందులో కొద్దిగా సాల్ట్ మిక్స్ చేసుకుని తింటారు. లేదంటే, అల్లాన్ని రసంగా చేసుకుని గోరువెచ్చని నీటితో కలిసి తాగుతుంటారు. కావాలంటే అందులో కాస్తంత తేనె కూడా చేర్చుకోవచ్చు.
ఎలా తీసుకున్నా అల్లం ఆరోగ్యానికి మంచిదే. రోగ నిరోధక శక్తిని పెంచడంలో అల్లం తోడ్పడుతుంది. అలాగే, అల్లంలో మెగ్నీషియం, జింక్ అధికంగా వుండడం వల్ల కీళ్ల వాపులు రాకుండా వుంటాయ్.
వయసుతో వచ్చే కీళ్ల నొప్పుల సమస్యలకూ దూరంగా వుండే అవకాశం వుంటుంది. అలాగే కొందరికి కాళ్లలో నీరు చేరి వాపులు వస్తుంటాయ్. ఆ సమస్య వున్న వాళ్లు కూడా రోజూ వుదయాన్నే అల్లం రసం తాగడం అలవాటు చేసుకుంటే ఎంతో మంచిది అంటున్నారు.
రకరకాల ఇన్ఫెక్షన్ల కారణంగా తరచూ అనారోగ్యం బారిన పడేవారికి అల్లం రసం దివ్యౌషధంగా నిపుణులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







