వాహనదారులకు దుబాయ్ ట్రాఫిక్ విభాగం హెచ్చరికలు

- September 12, 2023 , by Maagulf
వాహనదారులకు దుబాయ్ ట్రాఫిక్ విభాగం హెచ్చరికలు

యూఏఈ: దుబాయ్ ట్రాఫిక్ విభాగం వాహనదారులకు హెచ్చరిక జారీ చేసింది. దుబాయ్ లోని ఓ ప్రధాన రహదారిపై ప్రమాదం జరిగిన తర్వాత  అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మంగళవారం తెల్లవారుజామున ప్రమాదం జరగడంతో అధికారులు వాహనదారులకు అలెర్ట్ జారీ చేశారు. ప్రమాదం గురించి వాహనదారులను హెచ్చరించడానికి అధికారులు X (ట్విటర్) ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో పలు కీలక అంశాలపై వాహనదారులకు సూచనలు చేశారు. లతీఫా బింట్ హమ్దాన్ బ్రిడ్జి నుంచి జెబెల్ అలీ వైపు వస్తున్న అల్ ఖైల్ రోడ్డులో ఈ ప్రమాదం జరిగిందని వివరించారు. ఈ ఏరియాలో వాహనాలు నడిపేటప్పుడు వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని ప్రకటనలో కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com