క్రౌన్ ప్రిన్స్ భారతదేశ పర్యటనపై కేబినెట్ ప్రశంసలు

- September 13, 2023 , by Maagulf
క్రౌన్ ప్రిన్స్ భారతదేశ పర్యటనపై కేబినెట్ ప్రశంసలు

నియోమ్: NEOMలో మంగళవారం రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశమైంది.ఈ సందర్భంగా  క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ జీ20  సమావేశం సందర్భంగా భారతదేశ పర్యటన సత్ఫలితాలు ఇచ్చిందని కేబినెట్ ప్రశంసలు కురిపించింది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో జరిపిన చర్చలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా G20 లీడర్స్ సమ్మిట్‌లో క్రౌన్ ప్రిన్స్ ప్రసంగం సౌదీ లక్ష్యాత్మక నిర్ణయాలను ప్రపంచం ముందు పెట్టిందన్నారు. G20 సభ్య దేశాలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మధ్య సహకారాన్ని పెంచుతుందని భావిస్తున్న నిర్ణయాలను కేబినెట్ ప్రశంసించింది.

అనంతరం మీడియా మంత్రి సల్మాన్ బిన్ యూసఫ్ అల్-దోసరీ మాట్లాడుతూ.. భారతదేశం, మధ్యప్రాచ్యం,  యూరప్‌లను కలుపుతూ ఆర్థిక కారిడార్ ఏర్పాటును స్వాగతించనున్నట్లు పేర్కొన్నారు. ఆసియాను యూరప్‌తో అనుసంధానించే రాజ్యం గుండా వెళుతున్న ఖండాంతర గ్రీన్ ట్రాన్సిట్ కారిడార్ల ఏర్పాటుకు ప్రోటోకాల్‌ను అభివృద్ధి చేయడంలో సహకారంతో సౌదీ అరేబియా యునైటెడ్ స్టేట్స్‌తో సంతకం చేసిన అవగాహన ఒప్పందాన్ని కూడా మంత్రివర్గం చర్చించిందని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com