అరబిక్ భాషలో విదేశీ పదాలు.. వ్యతిరేకించిన షార్జా పాలకుడు

- September 13, 2023 , by Maagulf
అరబిక్ భాషలో విదేశీ పదాలు.. వ్యతిరేకించిన షార్జా పాలకుడు

యూఏఈ: అరబిక్ భాషలో విదేశీ పదాలను నమోదు చేయడాన్ని షార్జా పాలకుడు తీవ్రంగా వ్యతిరేకించారు. గత నాలుగేళ్లలో నమోదైన అన్ని విదేశీ పదాల గురించి చర్చించేందుకు అక్టోబర్ 2న కైరోలో జరిగే అరబిక్ లాంగ్వేజ్ అకాడమీ సమావేశానికి హాజరుకావాలని భావిస్తున్నట్లు సుప్రీం కౌన్సిల్ సభ్యుడు,  షార్జా పాలకుడు హిస్ హైనెస్ షేక్ డాక్టర్ సుల్తాన్ బిన్ ముహమ్మద్ అల్ ఖాసిమి తెలిపారు.  అరబిక్ భాషను మార్చడానికి ఎవరూ సాహసించరని అన్నారు.  షార్జా బ్రాడ్‌కాస్టింగ్ అథారిటీ యొక్క 'డైరెక్ట్ లైన్' కార్యక్రమంలో షేక్ డాక్టర్ సుల్తాన్ ప్రసంగించిన సమయంలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. విదేశీ పదాల వాడకం విపరీతంగా పెరిగిపోయిందని ఆయన అన్నారు. కైరోలోని అరబిక్ లాంగ్వేజ్ అకాడమీ సభ్యులుగా విదేశీ పదాలను కలపడంపై పునఃపరిశీలించాలని తాము డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com