నిద్రలేమికి జాజికాయ మంచి ఔషధం తెలుసా.?
- September 13, 2023జాజికాయ అంటే గుర్తొచ్చేది ఘుమఘుమలాడే బిర్యానీ. అవును నిజమే..! బిర్యానీలో వాడే మసాలాల్లో జాజికాయ ఒకటి. అయితే,జాజికాయను కేవలం బిరియానీలో మాత్రమే కాదండోయ్.. రకరకాల డెజర్ట్‌లు, సూప్స్ , కొన్న రకాల వెజ్ కూరల్లోనూ విరివిగా వాడుతుంటారు.
కేవలం టేస్ట్ కోసమే జాజికాయను వాడుతుంటారనుకుంటే పొరపాటే. జాజికాయను చాలా కాలంగా ఆయుర్వేద మెడిసెన్‌లో వాడుతున్నారు.
జాజికాయ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా జీర్ణ సమస్యలు తొలగించుకోవడానికి జాజికాయను వినియోగించవచ్చట.
దీంట్లో యాంటీ ఆక్సిడెంట్లతో పాటూ, విటమిన్ ఏ, బి, సి.. వంటి ఖనిజాలు పుష్కలంగా వుంటాయని నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా నిద్రలేమిని పోగొట్టడంలో జాజి కాయ పాత్ర అత్యంత కీలకంగా చెబుతున్నారు. ఆయుర్వేదంలో నిద్రలేమికి సంబంధించి తయారు చేసే మందుల్లో జాజికాయను కీలకంగా వాడతారట.
నిద్రలేమికి చాలా మంది రకరకాల పిల్స్ తీసుకుంటారు. వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదముంది. కానీ, రాత్రి పూట గ్లాసుడు పాలల్లో చిటికెడు జాజికాయ పొడి వేసుకుని తాగితే నిద్రలేమికి చెక్ పెట్టొచ్చన్న విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఆరోగ్యానికి ఎంతమాత్రమూ హానికరం కాని ప్రక్రియ ఇది.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్‌లు