వివాదాస్పద ప్రముఖులకు కువైట్‌లో 'నో ఎంట్రీ'
- May 20, 2016
పవిత్ర రంజాన్ మాసంలో వివాదాస్పద ప్రముఖులకు కువైట్‌లోకి రానివ్వబోమని కువైట్ స్పష్టం చేసింది. పవిత్ర రంజాన్ మాసంలో మత ప్రముఖులు కొందరు కువైట్‌కి వచ్చి, ఇక్కడ ప్రసంగాలు చేయడం జరుగుతోందనీ, వివాదాస్పద అంశాలతో వార్తల్లోకెక్కే అలాంటి ప్రముఖులకు ఈసారి కువైట్ వచ్చేందుకు వీసాలు మంజూరు చెయ్యబోమని అధికారిక వర్గాలు స్పష్టం చేశాయి. ఇంటీరియర్ మినిస్ట్రీ, ఈ మేరకు ప్రభుత్వ సంస్థలు, సెక్యూరిటీ ఏజెన్సీస్‌తో సంప్రదింపులు జరిపి, ఎండోవ్మెంట్స్ మినిస్ట్రీ ద్వారా వివాదాస్పద ప్రముఖులకు సంబంధించిన లిస్ట్‌ని ఇవ్వాల్సిందిగా కోరింది. కొన్ని దేశాల నుంచి వచ్చేవారిపై నిఘా పెట్టడంతోపాటు, వీసాలను తక్కువగా మంజూరు చెయ్యాలని కూడా మినిస్ట్రీ సన్నాహాలు చేస్తోంది. సిరియన్స్, జోర్డానియన్స్, ఇరాకీస్, యెమనీస్, కువైటీస్ తదితరులు ఈ లిస్ట్‌లో ఉన్నట్లు తెలియవస్తోంది. మసీదుల వద్ద క్యాష్ రూపంలో డొనేషన్లను రద్దు చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. బెగ్గింగ్‌పై పూర్తిస్థాయి నిషేధం విధిస్తున్నారు. ఇతర దేశాల నుంచి వచ్చే వ్యక్తులు బెగ్గింగ్కి పాల్పడితే వారిని దేశం నుంచి బయటకు పంపడమే కాకుండా, మొత్తం గల్ఫ్ కో ఆపరేషన్ కౌన్సిల్ దేశాలనుంచి కూడా పూర్తిగా బహిష్కరించడం జరుగుతుందని అధికారిక వర్గాలు తెలిపాయి. మసీదుల వద్ద పటిష్టమైన భద్రత, నిఘా కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. మనీ ట్రాన్స్‌ఫర్‌పై ప్రత్యేక నిఘా పెడుతున్నారు. జూన్ 6 నుంచి పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమవుతుంది.
తాజా వార్తలు
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్‌లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!









