సౌదీ అరేబియాలో తుఫాన్.. వార్తలను ఖండించి NCM

- September 15, 2023 , by Maagulf
సౌదీ అరేబియాలో తుఫాన్.. వార్తలను ఖండించి NCM

రియాద్ : సౌదీ అరేబియాను తుఫాను తాకే అవకాశం ఉందని మీడియాలో ప్రచారం అవుతున్న వార్తా కథనాలను సౌదీ నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరాలజీ (NCM) ప్రతినిధి హుస్సేన్ అల్-ఖహ్తానీ తిరస్కరించారు. "సౌదీ అరేబియా వాతావరణం నేరుగా తుఫానుల వల్ల ప్రభావితమవుతుందని మీడియా నివేదికలు తప్పు. ఇది మీడియా హైప్ తప్ప మరేమీ కాదు" అని ఆయన అన్నారు. సౌదీ అరేబియా ఉష్ణమండల తుఫానులు ఏర్పడని పాక్షిక-పరివేష్టిత సముద్రాల ప్రాంతంలో ఉందని పేర్కొన్నారు. NCM వెబ్‌సైట్ @NCMKSA ద్వారా మరియు X ప్లాట్‌ఫారమ్‌లోని కేంద్రం ఖాతా ద్వారా వివిధ వాతావరణ పరిస్థితుల వచ్చే సమాచారాన్ని మాత్రమే ప్రమాణికంగా తీసుకోవాలని అల్-ఖహ్తానీ సూచించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com