‘చంద్రముఖి 2’.! అంత సేపు భరించగలమా.!

- September 15, 2023 , by Maagulf
‘చంద్రముఖి 2’.! అంత సేపు భరించగలమా.!

సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో 17 ఏళ్ల క్రితం వచ్చిన ‘చంద్రముఖి’ సినిమాకి ఇన్నేళ్ల తర్వాత సీక్వెల్ తెరకెక్కిన సంగతి తెలిసిందే.

ప్రముఖ డాన్స్ కొరియెగ్రాఫర్, నటుడు, నిర్మాత, డైరెక్టర్ అయిన లారెన్స్ రాఘవ ఈ సినిమాలో లీడ్ రోల్ పోషిస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ టైటిల్ రోల్ పోషిస్తోంది.

కాగా, ఇటీవల వచ్చిన ఈ సినిమా ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాయ్. అబ్బురపరిచే విజువల్ ఎఫెక్ట్సే ఈ సినిమాకి ప్రాణం. ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు చిత్ర నిర్మాతలు.

తాజాగా ఈ సినిమా రన్ టైమ్ లాక్ చేశారు. 170 నిముషాల (2.50 గంటలు) రన్ టైమ్‌తో సినిమా ఎండ్ అవ్వనుందట. అంటే దాదాపు మూడు గంటల సమయమే. మరి అంత సేపు ఆడియన్స్‌ని ధియేటర్‌లో లాక్ చేసి వుంచగలిగే కంటెంట్ విజువల్ ఎఫెక్ట్స్ ఈ సినిమాలో చూపించగలరా.? అంటే సెప్టెంబర్ 28 వరకూ ఆగాల్సిందే. అదే రోజు ‘చంద్రముఖి 2’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com