6.2 మిలియన్ దిర్హాంల విలువైన నిషేధిత పదార్థాలు సీజ్
- September 18, 2023
యూఏఈ: ఎయిర్ కార్గో ద్వారా భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ప్రయత్నాన్ని దుబాయ్ కస్టమ్స్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అడ్డుకున్నది. ఈ సందర్భంగా 200,000 నిరోధిత మాదక ద్రవ్యాలు, సుమారు Dh6.2 మిలియన్ల విలువైన మాత్రల అక్రమ రవాణాను విజయవంతంగా నిరోధించారు. ఆసియాలోని ఓ దేశం నుండి వచ్చిన రెండు షిప్మెంట్లపై అనుమానం రావడంతో దుబాయ్ కస్టమ్స్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లోని ప్రత్యేక బృందం ఈ ఆపరేషన్ చేపట్టినట్లు అధకారులు తెలిపారు. వారి తనిఖీలో 20 పొట్లాలు, 460 కిలోల బరువున్న నియంత్రిత ఫార్మాస్యూటికల్స్‌తో కూడిన మొదటి షిప్మెంట్ ను గుర్తించి స్వాధీనం చేసుకున్నది. దాదాపు 1 మిలియన్ దిర్హామ్ మార్కెట్ విలువ ఉంటుందని తెలిపారు. 22 పొట్లాలను కలిగి ఉన్న రెండవ షిప్మెంట్లో 520కిలోల ట్రామాడోల్ ను గుర్తించారు. మొత్తం 175,300 నిషేధిత టాబ్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి మార్కెట్ విలువ సుమారుగా 5.25 మిలియన్ దిర్హామ్‌లుగా అంచనా వేశారు. ప్రోటోకాల్‌లను అనుసరించి దుబాయ్ పోలీస్ యొక్క జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ యాంటీ నార్కోటిక్స్‌కు అప్పగించినట్లు దుబాయ్ కస్టమ్స్ డైరెక్టర్ జనరల్ అహ్మద్ మహబూబ్ ముసాబిహ్ వెల్లడించారు.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్‌లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్‌లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







