ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణకు 500 పెట్రోల్ కార్లు సిద్ధం

- September 17, 2023 , by Maagulf
ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణకు 500 పెట్రోల్ కార్లు సిద్ధం

కువైట్: కొత్త విద్యా సంవత్సరం ఆదివారం ప్రారంభం కానున్నందున ట్రాఫిక్‌ను సులభతరం చేసేందుకు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అన్ని చర్యలను తీసుకుంటోంది. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు కువైట్ చుట్టూ 500 పెట్రోలింగ్ వాహనాలను ఏర్పాటు చేసేందుకు ట్రాఫిక్ విభాగం ఏర్పాట్లు చేసింది. సెప్టెంబరు 17 నాడు కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుండగా.. సుమారు 43,500 మంది విశ్వవిద్యాలయ విద్యార్థులు, సుమారు 382,000 మంది ప్రాథమిక, ఇంటర్మీడియట్,  మాధ్యమిక పాఠశాల విద్యార్థులు ఒకేసారి రోడ్డెక్కనుండటంతో రహదార్లపై రద్దీ పెరుగుతుందని భావిస్తున్నారు. మరోవైపు ట్రాఫిక్‌ను తగ్గించడానికి సివిల్ సర్వీస్ కమిషన్ ఉద్యోగులకు అనువైన పని గంటలను ఆమోదించింది. తద్వారా మంత్రిత్వ శాఖ ఉద్యోగులు ఉదయం 7 నుండి 9 గంటల మధ్య ఎప్పుడైనా హాజరు నమోదు చేయవచ్చు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com