సింగపూర్ లో శాస్త్రోక్తంగా ఏకాదశ రుద్రాభిషేకం

- September 18, 2023 , by Maagulf
సింగపూర్ లో శాస్త్రోక్తంగా ఏకాదశ రుద్రాభిషేకం

సింగపూర్: లోకాసమస్త సుఖినో భవంతు అన్న మహా సత్సంకల్పంతో మన ఋషులు వేద ప్రమాణంగా నిర్దేశించిన దిశను, సాంప్రదాయ, అనుష్ఠానాలని  కొనసాగించాలన్న ముఖ్య ఉద్దేశం తో  సింగపూర్ లో నివసించే కొంతమంది తెలుగు బ్రాహ్మణులు ఒక సమూహంగా ఏర్పడి, ధర్మ నిరతి మరియు ధర్మ అనుష్టానం కొరకు 2014 నుంచి అనేక కార్యక్రమాలు (నిత్యసంధ్యావందనం, లక్ష గాయత్రి హోమం, సామూహిక సత్యనారాయణస్వామి వ్రతం,  మాస శివరాత్రి సందర్భంగా రుద్రాభిషేకం) నిర్వహిస్తూ విజయవంతంగా కొనసాగిస్తున్నారు. 

ఈ క్రమంలో 16 Sept 2023 (భాద్రపద శుద్ధ పాడ్యమి నాడు)  జరిగిన ఏకాదశ రుద్రాభిషేకం కార్యక్రమానికి విశేషమైన స్పందన లభించింది. దాదాపు 40 మందికి పైగా రుత్వికులు పాల్గొన్న ఈ కార్యక్రమములో సింగపూర్ లో నివసిస్తున్న తెలుగు వారు పెద్దఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

కార్యక్రమానికి వచ్చిన మహిళలు లలితా పారాయణం, సౌందర్య లహరి, లింగాష్టక పఠనం, హారతి గానంతో అందరిని మంత్రముగ్దులను చేసారు.

ఈ కార్యక్రమమునకు విచ్చేసిన మహిళలు అందరు చక్కని సమన్వయంతో తీర్ధ ప్రాసాదాలు మరియు చక్కటి  తెలుగు సాంప్రదాయ ప్రసాద విందుని ఏర్పటు చేసారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com