అప్డేట్ చేసిన యూఓబీ యాప్ ప్రారంభం

- September 18, 2023 , by Maagulf
అప్డేట్ చేసిన యూఓబీ యాప్ ప్రారంభం

బహ్రెయిన్: యూనివర్సిటీ ఆఫ్ బహ్రెయిన్ (UoB) ను బహ్రెయిన్ ఉప ప్రధాన మంత్రి షేక్ ఖలీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా సందర్శించారు. ఈ సందర్భంగా కొత్తగా అభివృద్ధి చేసిన యూనివర్సిటీ ఆఫ్ బహ్రెయిన్ (UoB) అప్లికేషన్‌(యాప్)ను ప్రారంభించారు. హిస్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా నాయకత్వంలో.. క్రౌన్ ప్రిన్స్-ప్రధాన మంత్రి అయిన హిస్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా ఫాలో-అప్‌తో.. బహ్రెయిన్ జాతీయ  విశ్వవిద్యాలయాలు టెక్నాలజీ, డిజిటల్ పరివర్తన రంగంలో అగ్రగామిగా ఉంటాయని తెలిపారు. ఇది ఉన్నత విద్యా రంగ సేవలను మెరుగుపరచడానికి, విశ్వవిద్యాలయాల పోటీతత్వాన్ని పెంచడానికి, జీవితకాల లెర్నింగ్, జ్ఞానం, పరిశోధన కోసం మంచి అవకాశాలను అందిస్తుందని వెల్లడించారు.     

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com