కొత్త పార్లమెంటులో మంగళవారమే తొలి సమావేశం..

- September 18, 2023 , by Maagulf
కొత్త పార్లమెంటులో మంగళవారమే తొలి సమావేశం..

న్యూ ఢిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. అయితే వర్షాకాల సాధారణ సమావేశాల్లోనే నూతన పార్లమెంట్ భవనంలో సమావేశాలు ప్రారంభమవుతాయని స్వయంగా కేంద్ర మంత్రి ఒకరు చెప్పినప్పటికీ అది ఆచరణలో సాధ్యం కాలేదు. కాగా, తాజాగా ప్రత్యేక సమావేశాల సందర్భంగా నూతన భవనంలోని పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మంగళవారం మధ్యాహ్నం 2:15 గంటలకు రాజ్యసభ సమావేశం కానుంది. ఇక నుంచి నూతన భవనంలోనే పార్లమెంట్ కార్యకలాపాలు కొనసాగనున్నాయి.

నూతన పార్లమెంట్ భవనాన్ని మే 28న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ప్రధాని మోదీతో పాటు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కూడా హాజరయ్యారు. కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రారంభించడానికి ముందు ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కొత్త పార్లమెంటు భవనంలో మహాత్మా గాంధీకి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కాసేపు లోక్ సభ హాలులో సమావేశం జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com