అమెరికా: చంద్రబాబుకు మద్దతుగా ఎన్నారైలు.. నిరసన ప్రదర్శనలు

- September 18, 2023 , by Maagulf
అమెరికా: చంద్రబాబుకు మద్దతుగా ఎన్నారైలు.. నిరసన ప్రదర్శనలు

అమెరికా: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా హౌస్టన్ నగరంలో తెలుగు ప్రవాస భారతీయులు ఆదివారం, భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.

"NRI’s with CBN", "Save Democracy” , “Save AP" , “Houston with CBN“ అనే నినాదాలతో నగరంలో దాదాపు మూడు గంటల పాటు ప్రదర్శన చేసి, తమ నిరసన తెలియ చేసారు.

హ్యూస్టన్ ఎన్.ఆర్.ఐ టిడిపి వారి ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో 200 మంది పైగ పాల్గోని సంఘీభావం తెలియజేసారు. చంద్రబాబు నాయుడు కృషితో ఈ రోజు అగ్రరాజ్యంలో మంచి హోదాలలో వివిధ కంపెనీలో లబ్ధిపొందుతున్నం అని కొనియాడారు, ఇలా అన్యాయంగా, కక్షపూర్వితంగా నిర్బందించటం పాలకుల తీరుకి నిదర్శనం, ఆయన్ని త్వరగా  విడుదల చేయాలి అని శాంతియుతంగా జై బాబు అని నినాదాలతో కార్యక్రమం ముగించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com