ఒమన్ హెల్త్ ఎగ్జిబిషన్, కాన్ఫరెన్స్ ప్రారంభం

- September 19, 2023 , by Maagulf
ఒమన్ హెల్త్ ఎగ్జిబిషన్, కాన్ఫరెన్స్ ప్రారంభం

మస్కట్: ‘ఒమన్ హెల్త్ ఎగ్జిబిషన్ అండ్ కాన్ఫరెన్స్ 2023’ 12వ ఎడిషన్ ఈరోజు ఒమన్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్ (OCEC)లో ప్రారంభమైంది. 3-రోజుల ఈవెంట్‌లో 160కిపైగా స్థానిక పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు పాల్గొంటున్నాయి.  ఆరోగ్య సంరక్షణ రంగంలో సరికొత్త ఆవిష్కరణలు, అన్వేషణలను ప్రదర్శించనున్నారు. ఒమన్ ఎగ్జిబిషన్స్ ఆర్గనైజింగ్ కంపెనీ (కనెక్ట్) సహకారంతో ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. సయ్యద్ ఖలీద్ హమద్ అల్ బుసాయిదీ ఆధ్వర్యంలో ఒమన్ హెల్త్ ఎగ్జిబిషన్, కాన్ఫరెన్స్ 2023 ప్రారంభ కార్యక్రమం జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com