4 ఏళ్ల క్యాన్సర్ రోగి కోరికను తీర్చిన రాయల్ ఫ్యామిలీ మెంబర్..!
- September 19, 2023
యూఏఈ: షార్జాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో లుకేమియాతో చికిత్స పొందుతున్న హమ్దాన్ అనే నాలుగేళ్ల చిన్నారిని దుబాయ్ రాజకుటుంబానికి చెందిన సభ్యుడు పరామర్శించారు. మార్చిలో హమ్దాన్‌కు వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. అతని కెమోథెరపీ సెషన్‌లు మరుసటి నెలలో ప్రారంభమయ్యాయి. అతను దుబాయ్ రాజ కుటుంబ సభ్యుడిని కలవాలని తన కోరికను డాక్టర్ల వద్ద వ్యక్తం చేశాడు. ఎమిరేట్స్ రెడ్ క్రెసెంట్ సంస్థ ఆయన కోరికను తాజాగా తీర్చింది. మక్తూమ్ కుటుంబానికి ప్రాతినిధ్యం వహిస్తున్న షేక్ బుట్టి అల్ సయీద్ అల్ మక్తూమ్ వ్యక్తిగతంగా హమ్దాన్‌ను పరామర్శించారు. అతనికి బహుమతులు అందించారు. త్వరలోనే తను కోలుకోవాలని ఆకాంక్షించారు. దీంతో హమ్దాన్ సంతోషించాడు. తమ కోరికను మన్నించి.. ధైర్యం చెప్పేందుకు రాజకుటుంబానికి చెందిన వ్యక్తి రావడంపై అతని తల్లి ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







