పాఠశాల రవాణా రుసుమును 78% తగ్గించిన ఖతార్
- September 19, 2023
దోహా: తల్లిదండ్రులపై ఆర్థిక భారాన్ని తగ్గించే దిశగా విద్యాశాఖ, ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. పాఠశాల రవాణా రుసుములో 78% తగ్గింపును ప్రకటించింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న మరియు నాన్-జిసిసి పౌరులు అయిన ఖతారీయేతర విద్యార్థులకు ప్రతి సెమిస్టర్ రవాణా రుసుము QAR 220గా నిర్ణయించబడిందని విద్యాశాఖ మంత్రి బుతైనా బింట్ అలీ అల్ జబ్ర్ అల్ నుయిమి తెలిపారు. రవాణా రుసుములు గతంలో ఒక్కో సెమిస్టర్‌కు ఒక్కో విద్యార్థికి QAR 1,000గా ఉన్నందున, తాజాగా వాటిని 78% మేరకు తగ్గించినట్లు వెల్లడించారు. దీంతోపాటు మినిస్ట్రీ ఆఫ్ ఎండోమెంట్స్, ఇస్లామిక్ అఫైర్స్‌తో అనుబంధంగా ఉన్న ఇమామ్‌లు మరియు మ్యూజిన్‌ల పిల్లలకు పుస్తకాల ధర, రవాణా రుసుము నుండి మినహాయింపు ఇవ్వాలని మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.
అందరికీ నాణ్యమైన విద్యను అందించాలనే దాని దృక్పథానికి అనుగుణంగా తాజా నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రతి సెమిస్టర్‌కు ప్రతి విద్యార్థికి పాఠ్యపుస్తకాల ధర QAR 150గా నిర్ణయించబడిందని పేర్కొంది. అదే సమయంలో ఖతార్ మహిళలు, వికలాంగుల పిల్లలకు పుస్తకాల ధర..వాణా ఛార్జీలను చెల్లించకుండా మినహాయించారు. 2023/2024 విద్యా సంవత్సరం ప్రారంభం నుండి ఈ నిర్ణయం అమలు చేయబడుతుందని విద్యాశాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం







