43 కార్ ఏజెంట్లు, పంపిణీదారులపై క్రిమినల్ కేసులు నమోదు

- September 19, 2023 , by Maagulf
43 కార్ ఏజెంట్లు, పంపిణీదారులపై క్రిమినల్ కేసులు నమోదు

జెడ్డా: పోటీ చట్టాన్ని ఉల్లంఘించినందుకు 43 కార్ ఏజెంట్లు, పంపిణీదారులపై మరియు అనేక ఇతర రంగాలలోని 24 సంస్థలపై కేసులు నమోదు చేసినట్లు సౌదీ జనరల్ అథారిటీ ఫర్ కాంపిటీషన్ (GAC) వెల్లడించింది. ఆటోమొబైల్, స్పేర్ పార్ట్‌లు మరియు అమ్మకాల తర్వాత సేవల విభాగంలోని దర్యాప్తు ఫలితాలను సమీక్షించామని, ఇందులో 70 సంస్థలపై 128 పరిశోధనలు ఉన్నాయని, 43 సంస్థలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నిర్ణయించామని, పరిశోధనలు కొనసాగుతున్నాయని అథారిటీ ఒక ప్రకటనలో తెలిపింది. అధికార యంత్రాంగం తొమ్మిది సంస్థలపై అవసరమైన చర్యలు తీసుకుందని తెలిపింది.  కాంపిటీషన్ లా నిబంధనలను ఉల్లంఘించిన విషయంలో మూడు సంస్థలపై క్రిమినల్ వ్యాజ్యాలు దాఖలు చేయాలని నిర్ణయించినట్టు పేర్కొంది. SR7.7 మిలియన్ల ప్రాజెక్ట్‌లలో కుమ్మక్కయ్యారనే అనుమానంతో ఆరు సంస్థలపై కేసులను నమోదు చేయించినట్లు తెలిపింది.

ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రాజెక్ట్‌ల కోసం SR432800 మొత్తానికి బిడ్‌లు సమర్పించిన ఐదు సంస్థల అనుమానిత ఒప్పందంపై దర్యాప్తు ఫలితాలను GAC అధ్యయనం చేసింది. ఇందులో లోపాలు గుర్తించడంతో ఈ సంస్థలపై దావా వేయాలని నిర్ణయించింది. SR600 మిలియన్ల విలువ కలిగిన ఒక ప్రధాన కంపెనీ తయారీ ప్రాజెక్టులలో తమ బిడ్‌లను సమర్పించిన ఎనిమిది సంస్థల కుట్రపై దర్యాప్తు ఫలితాల ఆధారంగా ఆరు సంస్థలపై వ్యాజ్యాలు వేయాలని నిర్ణయించింది. పిల్లల కోసం ఆరోగ్య ఉత్పత్తి ధరలను ఏకీకృతం చేయడానికి మూడు ప్రధాన ఫార్మసీలు, నాలుగు రిటైల్ మార్కెట్‌ల మధ్య జరిగిన ఒప్పందంపై దర్యాప్తు ఫలితాలను సమీక్షించి ఆయా సంస్థలపై దావాలు వేయాలని నిర్ణయించినట్లు వెల్లడించింది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com