బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోనీ కుమార్తె ఆత్మహత్య..
- September 19, 2023
కేరళ: బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు విజయ్ ఆంటోనీ. ఆ తర్వాత పలు సినిమాలతో మెప్పించారు. ఓ పక్క నటుడిగా, మరో పక్క మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా బిజీగా ఉన్నారు విజయ్ ఆంటోనీ. ఇటీవలే బిచ్చగాడు 2 సినిమాతో వచ్చి మంచి విజయం సాధించారు. విజయ్ ఆంటోనీకి ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు.
విజయ్ ఆంటోనీ కూతురు లారా ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ చదువుతుంది. తాజాగా ఇవాళ తెల్లవారు జామున లారా తన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీంతో తమిళ పరిశ్రమ ఒక్కసారిగా షాక్ అయింది. అంత సక్సెస్ ఫుల్ హీరో, సంగీత దర్శకుడి కూతురు ఎంధుకు ఆత్మహత్య చేసుకుందో ఎవరికీ అర్ధం కావట్లేదు. తెల్లవారుజామున ఇంట్లో వాళ్ళు చూసి హాస్పిటల్ కి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారని సమాచారం.
అయితే 12వ తరగతి చదువుతున్న లారా ఆత్మహత్య ఎందుకు చేసుకుందా అనేదానికి ఇంకా సరైన కారణాలు ఎవరికీ తెలియలేదు. కానీ చదువుల ఒత్తిడితోనే ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమిక సమాచారం. దీంతో విజయ్ ఆంటోనీ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఆమెకు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







