ప్రయాణికులకు SR58 మిలియన్ల పరిహారం చెల్లించిన విమానయాన సంస్థలు
- September 19, 2023
రియాద్: 2021, 2022 సంవత్సరాల్లో ప్రయాణీకులకు జాతీయ విమానయాన కంపెనీలు చెల్లించిన మొత్తం పరిహారం SR58 మిలియన్లు అని జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (GACA) ప్రకటించింది. ఇది వినియోగదారుల హక్కులను పరిరక్షించడానికి కార్యనిర్వాహక నిబంధనలలో నిర్దేశించిన దానికి అనుగుణంగా ఉంటుందని పేర్కొంది. పరిహారం అందిందిచన కేసులు ప్రధానంగా విమాన రద్దు, విమాన ఆలస్యం, బ్యాగేజీ నష్టం, బ్యాగేజీని కోల్పోవడం వంటివి ఉన్నాయని GACA వైస్ ప్రెసిడెంట్ అబ్దుల్ అజీజ్ అల్దాహ్మాష్ వెల్లడించారు.
GACA గత నెలలో ప్రయాణీకుల హక్కులను పరిరక్షించడానికి కొత్త ఎగ్జిక్యూటివ్ రెగ్యులేషన్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం అమల్లో ఉన్నదాని స్థానంలో ఇది నవంబర్ 20 నుండి అమల్లోకి వస్తుంది. టిక్కెట్ విలువలో 150- 200 శాతం వరకు పరిహారం పొందేందుకు అవకాశం ఉంటుంది. ప్రయాణీకుల లగేజీని పోగొట్టిన సమయంలో SR6568కి సమానమైన ఆర్థిక పరిహారాన్ని అందజేస్తారు. సామాను దెబ్బతినడం, లోపం లేదా ఆలస్యం అయిన సందర్భంలో ప్రయాణీకుడు SR6568వరకు ఆర్థిక పరిహారాన్ని పొందేందుకు అర్హులు.
తాజా వార్తలు
- యూఏఈలో చివరి లాంగ్ వీకెండ్: Dh725 నుండి ట్రావెల్ డీల్స్
- యూఏఈ ఐఫోన్ 15: ఆపిల్ స్టోర్ కు పోటెత్తిన కొనుగోలుదారులు
- గ్లోబల్ టాలెంట్ ర్యాంకింగ్స్.. బహ్రెయిన్ కు టాప్ ర్యాంకులు
- 38 క్రిమినల్ కేసులలో నిందితుడైన భారతీయ ప్రవాసి అరెస్ట్
- కల్తీ ఉత్పత్తుల తయారీ..నివాసితుడికి 2 సంవత్సరాల జైలు, SR20000 జరిమానా
- హైదరాబాద్ విమానాశ్రయాన్ని సందర్శించిన నేషనల్ కమిషన్ వైస్ చైర్మన్
- ఒమన్, స్లోవేకియా మధ్య వీసా మినహాయింపు ఒప్పందం
- భారతీయ వైద్యులకు గుడ్ న్యూస్..
- ఓటరుగా నమోదుకు ఆధార్ నంబర్ తప్పనిసరి కాదు
- చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు