ప్రపంచవ్యాప్తంగా విద్యకు $2.3 బిలియన్ల సహాయం
- September 20, 2023
న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా విద్యరంగానికి మద్దతు ఇవ్వడం అనేది ఖతార్ అభివృద్ధి ఎజెండాలో భాగంగా ఉందని ఖతార్ విద్య, ఉన్నత విద్యా శాఖ మంత్రి హెచ్ ఈ బుతైనా బింట్ అలీ అల్ జబ్ర్ అల్ నుయిమి తెలిపారు. వ్యూహాత్మక భాగస్వామ్యాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా విద్యకు మద్దతు ఇవ్వడానికి 2.3 బిలియన్ డాలర్ల సహాయాన్ని అందించినట్లు పేర్కొన్నారు. దీంతో లక్షలాది మంది విద్యార్థులు నాణ్యమైన విద్యా అవకాశాలను పొందుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. యువత తమ కమ్యూనిటీల అభివృద్ధికి మరియు శ్రేయస్సుకు దోహదపడేందుకు ఇది వీలు కల్పిస్తుందని ఆమె అన్నారు. న్యూయార్క్‌లో జరుగుతున్న 78వ UNGA సమావేశాల సందర్భంగా 'లెర్నింగ్ టూ బిల్డ్ బెటర్ ఫ్యూచర్ ఫర్ ఆల్’ అనే థీమ్‌తో నిర్వహంచిన సమావేశంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. ఐక్యరాజ్యసమితిలో ఖతార్ రాష్ట్ర శాశ్వత ప్రతినిధి షేఖా అల్యా అహ్మద్ బిన్ సైఫ్ అల్ థానీ ఈ సమావేశానికి హాజరయ్యారు.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ 2025 సాల్ట్ లేక్ సిటీ నిధుల సేకరణ కార్యక్రమం ఘనవిజయం
- కాగ్నిజెంట్ లో 25వేల మందికి ఉద్యోగాలు: CEO రవికుమార్
- కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- 2025లో యూఏఈ వీసా నియమాల్లో కీలక మార్పులు..!!
- కువైట్ లో పలు మీట్ షాప్స్ సీజ్..!!
- రసాయన ఆయుధాల నిషేధంపై కమిటీ ఏర్పాటు..!!
- టాక్సీ యజమానులకు జరిమానా మినహాయింపు..!!







