బోల్డ్ యాక్షన్ గాళ్ అవతారమెత్తిన కృతి సనన్.!
- September 20, 2023
అప్పుడెప్పుడో ‘వన్ నేనొక్కడినే’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది ముద్దుగుమ్మ కృతి సనన్. కానీ, తొలి సినిమాకే కృతి సనన్‌ని ఇంటికి పంపించేశారు తెలుగు ఆడియన్స్. ఆ తర్వాత ఇంకో ప్రయత్నం కూడా చేసింది. అదే ‘దోచేయ్’ సినిమా.
రెండూ ఆమెకు ఫెయిల్యూర్సే. దాంతో, బాలీవుడ్‌కి చెక్కేసింది. అక్కడ మొదట్లో కొన్ని పాట్లు పడినప్పటికీ, ఇప్పుడు స్టార్ హీరోయిన్‌గా చెలామణీ అవుతోంది.
ఇటీవలే, ‘ఆది పురుష్’ సినిమాతో మళ్లీ తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది కృతి సనన్. కానీ, ఈ సినిమా రిజల్ట్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక తాజాగా మరో సినిమా కృతి సనన్ నుంచి రాబోతోంది.
ఈ సినిమా కోసం కృతి సనన్ వైల్డ్ అండ్ బోల్డ్ యాక్షన్ గాళ్ అవతారమెత్తేసింది. బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ హీరోగా రూపొందుతోన్న ‘గణపథ్’ అనే సినిమాలో కృతి సనన్ హీరోయిన్‌గా నటిస్తోంది.
ఈ సినిమా కోసమే, కృతి సనన్ కంప్లీట్ మేకోవర్‌లో కనిపిస్తోంది. టైగర్ ష్రాఫ్ సినిమాలంటేనే ఫుల్ ఆఫ్ యాక్షన్ లెంగ్త్ మూవీస్. ఈ సినిమాలో కృతి సనన్.. అదీ ఓ యాక్షన్ గాళ్‌గా అంటే ఒకింత ఆసక్తికరంగానే కనిపిస్తోంది. వెరీ లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన ఈ సినిమా పోస్టర్‌లో కృతి సనన్ లుక్స్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది.
తాజా వార్తలు
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం
- మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!
- దర్బ్ అల్ సయ్ లో నేషనల్ డే కార్యకలాపాలు..!!
- సౌదీ అరేబియాలో సీజనల్ రెయిన్ ఫాల్..!!
- మనమా సౌక్.. మనమా ఆత్మ, హార్ట్ బీట్..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డు షిప్ సర్థాక్..!!
- ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్
- దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!







