ఓంకార్ అన్నయ్య మళ్లీ వస్తున్నాడోచ్.! ఈ సారి అంతకు మించి.!
- September 20, 2023
ఓం కార్ పేరు వినగానే బుల్లితెరపై పాపులర్ షోస్ గుర్తుకు వస్తాయ్. అలా పాపులర్ అయిన తన పాపులారిటీని పెద్ద తెరకీ ప్రసరించాడు యాంకర్ కమ్ ప్రొడ్యూసర్ అయిన ఓంకార్.
‘రాజుగారి గది’ సినిమాలతో వెండితెరపై ఓంకార్ ఫేమస్. అయితే, గత కొంత కాలంగా ఓంకార్ అన్నయ్య కాస్త జోరు తగ్గించాడు. మళ్లీ ఇప్పుడే జోరు పెంచినట్లు తెలుస్తోంది.
ఈ సారి బుల్లితెర కాదు, వెండి తెర కాదు.. ఓటీటీ తెరపై తన ప్రతాపం చూపించబోతున్నాడు. ప్రముఖ ఓటీటీ ఛానెల్ హాట్ స్టార్‌లో ఓ హారర్ వెబ్ సిరీస్‌కి శ్రీకారం చుట్టాడు ఓంకార్ అన్నయ్య.
త్వరలో ఈ సిరీస్ స్ర్టీమింగ్ కానుంది. ‘మ్యాన్షన్ 24’ అనే టైటిల్‌తో రూపొందిన ఈ వెబ్ సిరీస్ అబ్బుర పరిచే హారర్ అంశాలతో ఓటీటీ ప్రేక్షకులకి సరికొత్త థ్రిల్ ఇవ్వబోతోందట.
తాజాగా ఈ సిరీస్‌కి సంబంధించి ఓ పోస్టర్ రిలీజ్ చేసి ఈ విషయాన్ని కన్‌ఫామ్ చేశాడు ఓం కార్. అన్నట్లు ఈ సిరీస్‌లో వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తోంది. చూడాలి మరి, బుల్లితెరపైనా, వెండితెరపైనా తనదైన గుర్తింపు చాటుకున్న ఓంకార్ ఓటీటీ తెరపై ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతున్నాడో.!
తాజా వార్తలు
- ఖతార్ ఎయిర్వేస్ కు కొత్త సీఈఓ నియామకం..!!
- బీచ్‌లను క్లీన్ చేసిన కువైట్ డైవర్లు..!!
- సౌదీలో ఆరోగ్య సంరక్షణపై 95.7% మంది హ్యాపీ..!!
- ప్రైవసీ, డేటా ప్రొటెక్షన్ పై దృష్టి పెట్టండి..!!
- ఇండియా-ఒమన్ ఆర్థిక భాగస్వామ్యం..షురా కౌన్సిల్ సమీక్ష..!!
- హైదరాబాద్‌లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్‌లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్







