కొత్త భద్రతా ఫీచర్లతో స్కూలు బస్సులు

- September 20, 2023 , by Maagulf
కొత్త భద్రతా ఫీచర్లతో స్కూలు బస్సులు

మస్కట్: ఒమన్ సుల్తానేట్ అంతటా కొత్త భద్రతా ఫీచర్లతో స్కూలు బస్సులు తిరగనున్నాయి. స్కూల్ బస్సుల తయారీ రంగంలో అగ్రగామిగా ఉన్న ఒమానీ కంపెనీ కర్వా మోటార్స్ కంపెనీ, విద్యార్థులు ప్రయాణిస్తున్నప్పుడు వారి భద్రతను నిర్ధారించడానికి అత్యున్నత భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించబడిన పాఠశాల బస్సుల సరికొత్త మోడల్‌ను మంగళవారం విడుదల చేసింది. 2024 ప్రారంభం నాటికి ఒమన్ దేశీయ మార్కెట్‌లో సరికొత్త స్కూల్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. కార్వా స్కూల్ బస్సులో "దర్బ్ అస్సలామా" (సురక్షిత ప్రయాణం) వ్యవస్థకు అనుగుణంగా సరికొత్త భద్రతా పరికరాలు మరియు సిస్టమ్‌లు ఉంటాయి అని కార్వా మోటార్స్ సీఈఓ  డాక్టర్ ఇబ్రహీం అలీ అల్ బలూషి వెల్లడించింది. ఈ బస్సులను ఒమన్ విద్యా మంత్రిత్వ శాఖ ఆమోదించిందని తెలిపారు. కొత్త బస్సులో 23 మంది విద్యార్థులు వెళ్లవచ్చని, సీటింగ్ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుందని, సీసీకెమెరాలు, అగ్నినిరోధక సాధానాలు బస్సులో ఉంటాయన్నారు. “పాఠశాల బస్సులో అధిక-నాణ్యత ఎయిర్ కండిషనింగ్, సేఫ్టీ డోర్స్ లాక్,  సెన్సార్ సిస్టమ్‌తో కూడిన సైడ్ డోర్ల వ్యవస్థ, GPS సాంకేతికత ద్వారా బస్ లొకేషన్ ట్రాకింగ్ సిస్టమ్, డ్రైవర్ పనితీరును పర్యవేక్షించే వ్యవస్థను కూడా కలిగి ఉంటుంది.’’ అని అల్ బలూషి వివరించారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com