కార్మికులను సత్కరించిన దుబాయ్ పోలీసులు
- September 20, 2023
యూఏఈ: దుబాయ్‌లోని ఒక ఇంధన స్టేషన్‌లోని కార్మికులను దుబాయ్ పోలీసులు సత్కరించారు. ఇటీవల ఓ వాహనం అగ్ని ప్రమాదంపై వేగంగా మరియు సమర్థవంతంగా స్పందించినందుకు పోలీసులు ENOC స్టేషన్‌లోని కార్మికులను సత్కరించారు. దుబాయ్ పోలీసులు విడుదల చేసిన వీడియోలో ఇంధనం నింపుకోవడానికి టెంపో ట్రక్ గ్యాస్ స్టేషన్‌లోకి రావడం, ట్రక్ స్టేషన్‌లోకి వచ్చే క్రమంలో ఎడమ టైరును మంటలు చుట్టుముట్టినట్లు స్పష్టంగా చూపిస్తుంది. ఇది చూసిన స్టేషన్‌లోని అటెండర్లు మంటలను ఆర్పే యంత్రాలతో తీవ్రంగా కృషి చేయడం కనిపించింది. పోలీసులు ధైర్యవంతులైన ఉద్యోగులను కలుసుకొని వారి ఆలోచనను అభినందించారు. వారి ముందస్తు చర్య వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని ప్రశంసించారు. లెహబాబ్ పోలీస్ స్టేషన్ డైరెక్టర్ లెఫ్టినెంట్-కల్నల్ రషీద్ ముహమ్మద్ సలేం కార్మికులను అభినందించారు. కార్మికులకు అధికారులు ధ్రువపత్రాలు అందజేశారు. అయితే, అగ్నిప్రమాదం ఎప్పుడు జరిగిందనే వివరాలను పోలీసులు వెల్లడించలేదు.
తాజా వార్తలు
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం
- మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!
- దర్బ్ అల్ సయ్ లో నేషనల్ డే కార్యకలాపాలు..!!
- సౌదీ అరేబియాలో సీజనల్ రెయిన్ ఫాల్..!!
- మనమా సౌక్.. మనమా ఆత్మ, హార్ట్ బీట్..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డు షిప్ సర్థాక్..!!
- ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్
- దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!







