ఖైరతాబాద్ వినాయకుడిని సందర్శించిన వెంకయ్యనాయుడు

- September 21, 2023 , by Maagulf
ఖైరతాబాద్ వినాయకుడిని సందర్శించిన వెంకయ్యనాయుడు

హైదరాబాద్: దైవభక్తితో సాంత్వన కలుగుతుందని భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. గురువారం ఆయన హైదరాబాద్ లోని ఖైరతాబాద్ మహాగణపతిని కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ భారతీయులకు దైవభక్తి, గురుభక్తి మెండు అని అని చెప్పారు. గణపతి నవరాత్రుల వంటి ఉత్సవాల వల్ల దేశ సమైక్యత మరింత పెరుగుతుందన్నారు. దేశం ఎప్పుడూ శాంతిసామరస్యాలతో వర్ధిల్లాలని, భారత్ మరింత శక్తిమంతమైన దేశంగా ఎదగాలని, భారతీయులందరూ సుఖసంతోషాలతో విలసిల్లాలని గణేశుడిని ప్రార్థించినట్లు వెల్లడించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసిన రాష్ర్టప్రభుత్వాన్ని, ఉత్సవకమిటీని వెంకయ్యనాయుడు అభినందించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com