భారతీయ వైద్యులకు గుడ్ న్యూస్..

- September 22, 2023 , by Maagulf
భారతీయ వైద్యులకు గుడ్ న్యూస్..

న్యూ ఢిల్లీ: భారతీయ వైద్య విద్యార్థులకు ఓ గుడ్ న్యూస్. ఇక్కడ చదువుకున్న వారు ఇకపై విదేశాల్లో కూడా ప్రాక్టీస్ చేయచ్చు. జాతీయ వైద్య మండలికి(NMC) వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్(WFME) గుర్తింపు దక్కడంతో భరాతీయ విద్యార్థులకు ఈ సువర్ణావకాశం చిక్కింది. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా ప్రకటన ప్రకారం, ఎన్‌ఎంసీకి 10 ఏళ్ల కాలానికి ఈ గుర్తింపు దక్కింది. దీంతో, భారతీయ డాక్టర్లు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాతో పాటూ న్యూజీల్యాండ్‌లో పీజీ వైద్య కోర్సుల్లో చేరడంతో పాటూ అక్కడ ప్రాక్టీస్ చేయచ్చు. వచ్చే ఏడాది నుంచి భారతీయ విద్యార్థులు విద్య, ప్రాక్టీస్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

అంతేకాకుండా, రాబోయే పదేళ్లలో ఏర్పాటయ్యే కళాశాలలు కూడా ఈ గుర్తింపు పొందుతాయి. ప్రస్తుతం దేశంలో ఉన్న 706 మెడికల్ కాలేజీలకు ఈ గుర్తింపు దక్కింది. ‘‘ఈ వెసులుబాటుతో భారతీయ వైద్య కళాశాలలకు, నిపుణులకు అంతర్జాతీయంగా గుర్తింపు లభిస్తుంది. విదేశాల్లోని వైద్య విద్యాసంస్థలకు భారత్‌లోని కళాశాల మధ్య సంబంధాలు మెరుగుపడతాయి. వైద్య విద్యలో సరికొత్త ఆవిష్కరణలకు ఇదితోడ్పాటునందిస్తుంది. భారత్‌లో అందించే వైద్య విద్య అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉందనేందుకు డబ్ల్యూఎఫ్ఎమ్ఈ గుర్తింపు నిదర్శనం. దీని వల్ల భారతీయ వైద్య విద్యార్థులు ప్రపంచంలో ఎక్కడైనా తమ కెరీర్‌ను కొనసాగించవచ్చు. అంతేకాకుండా, విదేశీ విద్యార్థులను భారత వైద్య కళాశాలలు ఆకర్షిస్తాయి’’ అని ఎన్ఎంసీ ప్రతినిధి డాక్టర్ యోగేందర్ మాలిక్ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com