హైదరాబాద్ విమానాశ్రయాన్ని సందర్శించిన నేషనల్ కమిషన్ వైస్ చైర్మన్
- September 22, 2023
హైదరాబాద్: కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖకు చెందిన జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ వైస్ చైర్మన్ అంజనా పన్వర్ సెప్టెంబర్ 21న హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించారు. ఆమెకు హైదరాబాద్ ఎయిర్ పోర్టు ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడి వారి యోగక్షేమాలు, పని పరిస్థితులను తెలుసుకోవడమే ఆమె పర్యటన ఉద్దేశం. ఎజెండాలో భాగంగా సఫాయి కర్మచారులను నిర్వహించే ఏజెన్సీలతో ఆమె చర్చించారు. విమానాశ్రయంలో పని పరిస్థితుల పై కార్మికులు బాహాటంగానే సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యాలయం మరియు విమానాశ్రయంలో భద్రత, లైంగిక వేధింపులు, ఆరోగ్యం మరియు పరిశుభ్రత గురించి కార్మికులకు తరచుగా అవగాహన సెషన్లు నిర్వహించాలని ఆమె సూచించారు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







