కల్తీ ఉత్పత్తుల తయారీ..నివాసితుడికి 2 సంవత్సరాల జైలు, SR20000 జరిమానా

- September 22, 2023 , by Maagulf
కల్తీ ఉత్పత్తుల తయారీ..నివాసితుడికి 2 సంవత్సరాల జైలు, SR20000 జరిమానా

రియాద్: కల్తీ వెటర్నరీ ప్రిపరేషన్‌ల తయారీ కేసులో దోషిగా తేలిన ఒక ప్రవాస వ్యక్తికి దమ్మామ్‌లోని ప్రత్యేక న్యాయస్థానం రెండు సంవత్సరాల జైలు శిక్ష, SR20000 జరిమానా విధించింది. మోసం చేయాలనే ఉద్దేశ్యంతో వెటర్నరీ ప్రిపరేషన్‌ల కంటైనర్‌ల కోసం ప్యాకెట్‌లను తయారు చేయడం, ముద్రించడం వంటి కేసులో కూడా  అతను దోషిగా తేలారు. సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ (SFDA)కి చెందిన క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అధికారులు దమ్మామ్ నగరంలో తనిఖీలు చేపట్టింది. అదే సమయంలో థర్మల్ మ్యాప్‌లు, టెంపరేచర్ గేజ్‌లు లేకుండా అధిక ఉష్ణోగ్రతతో శీతలీకరించని కారులో వెటర్నరీ పరికరాలను రవాణా చేసే క్రమంలో నిందితుడు పట్టుబడ్డాడు. రెగ్యులేటరీ లైసెన్సులను పొందకుండానే వాణిజ్యం కోసం ఖాళీ కంటైనర్‌లను కొనుగోలు చేయడంతో పాటు సాంకేతిక నిబంధనలను వారు పాటించలేదని అధికారులు గుర్తించారు. అవసరమైన రెగ్యులేటరీ లైసెన్సులు లేకుండా ఏదైనా పశువైద్య పరికరాలు, ఉత్పత్తులను తయారీ చేయడం, మార్కెటింగ్ చేయడం గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) దేశాలలోని వెటర్నరీ ఉత్పత్తుల చట్టం కింద శిక్షార్హమైన కేసు. ఈ తరహా మోసాలను గుర్తిస్తే  19999కి కాల్ చేయడం ద్వారా లేదా అప్లికేషన్ ద్వారా నివేదించాలని ప్రజలకు పిలుపునిచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com