యూఏఈ ఐఫోన్ 15: ఆపిల్ స్టోర్ కు పోటెత్తిన కొనుగోలుదారులు
- September 22, 2023
యూఏఈ: శుక్రవారం తెల్లవారుజామున వేలాది మంది ఐఫోన్ ప్రియులు ఐఫోన్ 15 ను సొంతం చేసుకునేందుకు దుబాయ్ మాల్ ముందు బారులు తీరారు. మొదటి కొద్దిమంది కస్టమర్‌లు సరికొత్త ఐఫోన్ 15ను సొంతం చేసుకోగలిగారు. గంటల తరబడి క్యూలో వేచి ఉండి ఫోన్ ను కొనుగోలు చేసిన పలువురు సంతోషం వ్యక్తం చేశారు. ఆపిల్ స్మార్ట్‌ఫోన్‌ను పొందేందుకు నివాసితులు దేశంలోని అతిపెద్ద ఆపిల్ స్టోర్ అయిన దుబాయ్ మాల్ వద్ద గంటల కొద్ది క్యూలో నిల్చున్నారు. దుబాయ్ మాల్ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. క్యూలను అదుపు చేసేందుకు భద్రతా సిబ్బందిని నియమించారు. మాల్‌లోని రెండో అంతస్తు నుంచి గ్రౌండ్ ఫ్లోర్ వరకు జనం పెద్ద క్యూలలో ఏర్పాటు చేశారు. మాల్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజా వార్తలు
- గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇండెక్స్..8వ స్థానంలో ఒమన్..!!
- అమీర్ భారత్ పర్యటన విజయవంతం..!!
- సౌదీలో ముగ్గురు విదేశీయులు అరెస్ట్..!!
- శిథిల భవనాల కోసం అత్యవసర టాస్క్ఫోర్స్.. ఎంపీలు ఆమోదం..!!
- Dh1 స్కామ్: ఏఐతో వేలాది దిర్హామ్స్ కోల్పోయిన బాధితులు..!!
- అంతరాష్ట్ర ఎన్.డి.పి.ఎల్ సరఫరా చైన్ భగ్నం
- కువైట్ లో తీవ్రమైన పార్కింగ్ కొరత..అధ్యయనం..!!
- పామర్రు జనసేన పార్టీ శ్రేణులతో బండిరామకృష్ణ సమావేశం
- ప్రతి బింబాలు కథా సంపుటి ఆవిష్కరణ
- శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహోత్సవాలు ప్రారంభం