గ్లోబల్ టాలెంట్ ర్యాంకింగ్స్.. బహ్రెయిన్ కు టాప్ ర్యాంకులు
- September 22, 2023
బహ్రెయిన్: 2023 ఎడిషన్‌లో IMD వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్స్‌లో బహ్రెయిన్ తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది. లేబర్ ఫోర్స్ గ్రోత్ ఇండికేటర్‌లో 60 స్థానలు మెరుగుపడి ప్రపంచవ్యాప్తంగా 2వ ర్యాంక్‌ను సాధించింది. ప్రపంచ టాలెంట్ ర్యాంకింగ్ లో 23 స్థానాలు పెరిగి ప్రపంచవ్యాప్తంగా 10వ ర్యాంక్‌కు చేరుకుంది బహ్రెయిన్. మొత్తంమీద నివేదిక ద్వారా కొలవబడిన 64 దేశాలలో బహ్రెయిన్ 8 స్థానాలు మెరుగుపడి 27వ స్థానానికి చేరుకుంది. స్కిల్డ్ లేబర్ ఇండికేటర్‌తో సహా 7 సూచికలలో ప్రపంచవ్యాప్తంగా టాప్ 10 స్థానాల్లో బహ్రెయిన్ నిలిచింది. దీనితోపాటు బహ్రెయిన్ ఫైనాన్స్ స్కిల్స్, లాంగ్వేజ్ స్కిల్స్ మరియు ఎంప్లాయీ ట్రైనింగ్‌లో మెనా ప్రాంతంలో అగ్రగామిగా ఉంది. మొదటి రెండు సూచికలలో ప్రపంచవ్యాప్తంగా 6వ స్థానంలో.. మూడవ సూచికలో 19వ స్థానంలో ఉంది. IMD వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్ తాజా ఎడిషన్ ప్రకారం.. బహ్రెయిన్ పెట్టుబడులను ఆకర్షించడం, అభివృద్ధి చేయడం మరియు ప్రపంచ స్థాయిలో పోటీ పడేందుకు అవసరమైన ప్రతిభను కలిగిఉంది.
తాజా వార్తలు
- బాసర సరస్వతి అమ్మవారి ఆలయ సమీపంలో పేలుడు శబ్దాలు..
- యూకేని భయపెడుతున్న ‘100 రోజుల దగ్గు’..
- 100 మంది దుబాయ్ డ్రైవర్లకు 50,000 దిర్హామ్‌ల జరిమానా
- మస్కట్ విమానాశ్రయంలో ఫ్రీ జోన్ ఏర్పాటుకు ఒప్పందం
- ప్రముఖ 'హిడెన్' బీచ్ తాత్కాలికంగా మూసివేత
- అబ్దల్లిలో రోడ్డు ప్రమాదం..ఇద్దరు ఈజిప్టు ప్రవాసులు మృతి
- సైబర్ సెక్యూరిటీలో గ్లోబల్ సహకారానికి బహ్రెయిన్ పిలుపు
- సేవల్లో నిర్లక్ష్యం.. అనేక ఉమ్రా కంపెనీల లైసెన్స్‌లు రద్దు
- కర్ణాటకలో ఘోర ప్రమాదం..కారు చెరువులో పడి నలుగురు మృతి
- కేసీఆర్‌ని పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి