పోలీసుల నుండి తప్పించుకునే ప్రయత్నం.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

- September 23, 2023 , by Maagulf
పోలీసుల నుండి తప్పించుకునే ప్రయత్నం.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

మస్కట్: పోలీసుల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులు సలాలాలోని విలాయత్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు రాయల్ ఒమన్ పోలీసులు (ROP) తెలిపారు.  “ఇద్దరు వ్యక్తులు తమ వాహనాన్ని ట్రాఫిక్‌కు వ్యతిరేక దిశలో నడుపుతున్నారు. పోలీసులను చూసి తప్పించుకునే  క్రమంలో వారు మరొక వాహనాన్ని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు మరణించారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్‌తో సమన్వయంతో ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నాం.’’ అని రాయల్ ఒమన్ పోలీసులు తమ ప్రకటనలో వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com