ఫార్మసీ ప్రవేశాలకు తదిదశ నోటిఫికేషన్ విడుదల
- September 23, 2023
28వ తేదీ సీట్ట కేటాయంపు: చదలవాడ నాగరాణి
విజయవాడ: ఫార్మసీ ప్రవేశాలకు నిర్దేశించిన ఎపి ఈసెట్ తుదిదశ షేడ్యూలును సాంకేతిక విద్యా శాఖ కమీషనర్, అడ్మిషన్ల కన్వీనర్ చదలవాడ నాగరాణి శనివారం విడుదల చేసారు. తాజా నోటిఫికేషన్ ను అనుసరించి సెప్టెంబరు 25, 26 తేదీలలో విద్యార్ధులు ఆన్ లైన్ లో రిజిస్టేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు చేయవలసి ఉంది. సెప్టెంబరు 25 నుండి 27 వరకు ఆన్ లైన్ ద్వారా ధృవీకరణ పత్రాల వెరిఫికేషన్, ఆఫ్షన్ల ఎంపికకు అవకాశం కల్పించారు. ఎవరైన విద్యార్ధులు ఆఫ్షన్లను మార్చుకోదలిస్తే 27వ తేదీ మాత్రమే అవకాశం ఉంటుంది. 28వ తేదీ అయా కళాశాలల్లో రిజర్వేషన్లను అనుసరించి సీట్ల కేటాయింపు ఉంటుంది. 29,30 తేదీలలో విద్యార్ధులు తమకు కేటాయించిన కళాశాలల్లో వ్యక్తిగతంగా రిపోర్టు చేయాలి. ఇప్పటికే క్లాసులు ప్రారంభం అయినందున విధ్యార్దులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఫార్మసీ అడ్మిషన్లను పొందాలని కన్వీనర్ నాగరాణి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







