బహ్రెయిన్‌కు కొత్త రాయబారులను స్వాగతించిన ప్రిన్స్ సల్మాన్
- September 25, 2023
బహ్రెయిన్: డిప్యూటీ కింగ్, హిస్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా సఖిర్ ప్యాలెస్‌లో జరిగిన వేడుకలో బహ్రెయిన్ రాజ్యానికి కొత్తగా నియమించబడిన ఐదుగురు రాయబారుల ఆధారాలను(క్రెడెన్షియల్స్) అందుకున్నారు. డిప్యూటీ కింగ్ ను కలుసుకున్నవారిలో పీపుల్స్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ అల్జీరియా రాయబారి మహమూద్ బ్రహం, రిపబ్లిక్ ఆఫ్ కొరియా రాయబారి హియాన్సాంగ్ కూ, రిపబ్లిక్ ఆఫ్ ఫ్రాన్స్ రాయబారి ఎరిక్ గిరాడ్-టెల్మే, రిపబ్లిక్ ఆఫ్ ఇండియా రాయబారి వినోద్ కురియన్ జాకబ్, యునైటెడ్ కింగ్డమ్ రాయబారి అలస్టర్ లాంగ్ ఉన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ కింగ్ రాయబారులను స్వాగతించారు. బహ్రెయిన్ రాజ్యం మరియు వారి సంబంధిత దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే వారి దౌత్య విధులలో విజయం సాధించాలని, బహ్రెయిన్ రాజ్యంతో రాయబారులు సంబంధిత దేశాల మధ్య సంబంధాలను మరింత పెంపొందించాలని సూచించారు.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









