చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణ వాయిదా
- September 26, 2023
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. రెండు పిటిషన్లపై విచారణను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు ఏసీబీ కోర్టు ఇన్‌ఛార్జి జడ్జి వెల్లడించారు. బెయిల్ పిటిషన్‌పై ఇవాళ వాదనలు వినాలని చంద్రబాబు తరఫు లాయర్లు కోరగా.. ఇవాళే వాదనలు విని ఉత్తర్వులు ఇవ్వడం కష్టమని జడ్జి అభిప్రాయపడ్డారు. రేపటి నుంచి తాను సెలవుపై వెళ్లనున్నట్లు జడ్జి తెలిపారు. బుధవారం రెగ్యులర్ కోర్టులో వాదనలు వినిపించాలని న్యాయమూర్తి సూచించారు. విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జి ఈరోజు సెలవులో ఉండటంతో ఇన్‌ఛార్జి జడ్జిగా మెట్రోపాలిటన్ సెషన్స్ న్యాయమూర్తి వ్యవహరించారు.
తాజా వార్తలు
- ఐఫోన్ ఎగుమతుల్లో చరిత్ర సృష్టించిన భారత్
- మస్కట్ చేరుకున్న ప్రధాని మోదీ
- సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లపై కేంద్ర ప్రభుత్వం కొరడా
- చరిత్రలో నిలిచేలా TTD నిర్ణయాలు..!
- ANR కాలేజీకి నాగార్జున రూ.2 కోట్ల విరాళం
- కోడూరు అవుట్‌ఫాల్ స్లూయిస్ల పునర్నిర్మాణం: ఎంపీ బాలశౌరి
- ఏపీ సీఆర్డీఏ నోటిఫికేషన్ విడుదల
- కార్తీక్ శర్మ: ఐపీఎల్ 2026 వేలంలో 14.2 కోట్లు..
- రేపు నటుడు విజయ్ భారీ ర్యాలీ
- శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి







