3000కు పైగా నకిలీ గూడ్స్.. దుకాణం సీజ్

- September 26, 2023 , by Maagulf
3000కు పైగా నకిలీ గూడ్స్.. దుకాణం సీజ్

కువైట్: వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ నకిలీ వస్తువులను విక్రయిస్తున్న దుకాణాన్ని సీజ్ చేసింది.  బూట్లు, బ్యాగులు, బట్టలు మరియు ఉపకరణాలతో సహా అంతర్జాతీయ బ్రాండ్‌లకు చెందిన 3,000 కంటే ఎక్కువ నకిలీ వస్తువులను దుకాణంలో గుర్తించినట్లు అధికారులు తెలిపారు. కమర్షియల్‌ కంట్రోల్‌ ఎమర్జెన్సీ టీమ్‌ పర్యవేక్షణ, వెరిఫికేషన్‌ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత అధికారులు కార్యాలయంపై దాడి చేశారు. దుకాణాన్ని మూసివేసి చట్టపరమైన ప్రక్రియలను చేపట్టారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com