అక్టోబర్ 1నుంచి యూఏఈకి సేవలు పునఃప్రారంభం

- September 26, 2023 , by Maagulf
అక్టోబర్ 1నుంచి యూఏఈకి సేవలు పునఃప్రారంభం

మస్కట్: ఒమన్ జాతీయ రవాణా సంస్థ Mwasalat మంగళవారం యూఏఈకి తన సేవలను పునర్ ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. మస్కట్ నుండి అల్ ఐన్ మీదుగా అబుధాబికి అక్టోబర్ 1 నుండి తిరిగి ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో సమాచారాన్ని వెల్లడించింది. వన్-వే ట్రిప్‌కు టిక్కెట్‌కు ప్రారంభ ఆఫర్ OMR11.5 అని, ప్రయాణీకులు 23 కిలోల లగేజీతో పాటు 7 కిలోల హ్యాండ్ బ్యాగేజీని అనుమతించనున్నట్లు తెలిపారు. కొవిడ్-19 మహమ్మారి సమయంలో Mwasalat యూఏఈకి తన సేవలను నిలిపివేసింది. దుబాయ్‌కి సేవ ఇంకా ప్రారంభం కానప్పటికీ, అల్ ఐన్ ద్వారా అబుధాబికి కొత్త మార్గం అక్టోబర్ 1 నుండి ప్రారంభమవుతుందని ప్రకటించింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com