దుబాయ్ వరల్డ్ సెల్ఫ్ డ్రైవింగ్ కాంగ్రెస్.. ఛాలెంజ్ విజేతలకు $2.3 మిలియన్లు
- September 26, 2023
యూఏఈ: దుబాయ్ వరల్డ్ కాంగ్రెస్ ఫర్ సెల్ఫ్ డ్రైవింగ్ ట్రాన్స్‌పోర్ట్ మూడవ ఎడిషన్ సెప్టెంబర్ 26న దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో ప్రారంభమైంది. ఈ ఈవెంట్ మిడిల్ ఈస్ట్‌లో ఇదే మొదటిది. ఈ ఎడిషన్ థీమ్ "ఎంపవరింగ్ మొబిలిటీ 4.0.". రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్, డైరెక్టర్ జనరల్ మత్తర్ అల్ టేయర్ దుబాయ్ వరల్డ్ కాంగ్రెస్, ఛాలెంజ్ ఫర్ సెల్ఫ్ డ్రైవింగ్ ట్రాన్స్‌పోర్ట్‌లో పాల్గొన్నారు. "2030 నాటికి దుబాయ్‌లో 25 శాతం మొబిలిటీ ప్రయాణాలను స్మార్ట్ మరియు డ్రైవర్‌లెస్ ప్రయాణాలుగా మార్చడానికి ఉద్దేశించిన దుబాయ్ స్మార్ట్ సెల్ఫ్-డ్రైవింగ్ ట్రాన్స్‌పోర్ట్ స్ట్రాటజీని అమలు చేసేందుకు ఛాలెంజ్, దానితో పాటు ఎగ్జిబిషన్ స్థిరంగా ఉన్నాయి" అని అల్ టేయర్ వ్యాఖ్యానించారు. కొత్త ఆవిష్కరణలు, టెక్నాలజీ ఆలోచనలను పరస్పరం షేర్ చేసుకోవడానికి నిపుణులు, విధాన నిర్ణేతలు, టెక్నాలజీ డెవలపర్లు, పరిశోధకులు, విద్యావేత్తలను ఇది వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్యానెల్ చర్చలు, సెమినార్‌లు, వర్క్‌షాప్‌లు ఉంటాయన్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ కాంగ్రెస్‌లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2,000 మంది పాల్గొంటారని అంచనా.
దుబాయ్ ఛాలెంజ్
కాంగ్రెస్ ప్రారంభ రోజున ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా దుబాయ్ వరల్డ్ ఛాలెంజ్ ఫర్ సెల్ఫ్ డ్రైవింగ్ ట్రాన్స్‌పోర్ట్ 3వ ఎడిషన్ విజేతలకు సన్మానం జరుగుతుంది. ఇండస్ట్రీ లీడర్స్ కేటగిరీకి $2 మిలియన్ మరియు లోకల్ అకాడెమియా కేటగిరీకి $300,000తో ఇది మొత్తం $2.3 మిలియన్లను కలిగి ఉంది.ఛాలెంజ్ మూడవ ఎడిషన్‌లో పాల్టొనేందుకు ప్రపంచం నలుమూలల నుండి మొత్తం 27 దరఖాస్తులు వచ్చాయి. ఇండస్ట్రీ లీడర్స్ విభాగంలో అలెగ్జాండర్ డెన్నిస్ (యునైటెడ్ కింగ్‌డమ్), బ్రైట్ డ్రైవ్ (ఈజిప్ట్), కింగ్ లాంగ్ (చైనా), క్వాడ్రిబోట్ (ఫ్రాన్స్), మరియు iAuto టెక్నాలజీ (తైవాన్) ఐదు అంతర్జాతీయ సంస్థలు చివరి దశకు అర్హత సాధించాయి. లోకల్ అకాడెమియా విభాగంలో హెరియట్-వాట్ యూనివర్సిటీ, దుబాయ్, ఖలీఫా యూనివర్శిటీ - అబుదాబి, యూనివర్శిటీ ఆఫ్ దుబాయ్, యూనివర్శిటీ ఆఫ్ బోల్టన్ - రస్ అల్ ఖైమా, అమెరికన్ యూనివర్శిటీ ఆఫ్ షార్జా ఫైనల్స్‌కు ఐదు విశ్వవిద్యాలయాలు ఎంపికయ్యాయి.
తాజా వార్తలు
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం